కొమ్రంభీం జిల్లాలో పులుల సంచారం
ABN , First Publish Date - 2020-12-19T13:04:46+05:30 IST
కొన్ని రోజులుగా జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది. వీటి కదలికల నేపథ్యంలో అటవీశాఖ చర్యలు చేపట్టింది.

కొమ్రంభీం: కొన్ని రోజులుగా జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది. వీటి కదలికల నేపథ్యంలో అటవీశాఖ చర్యలు చేపట్టింది. డివిజన్‌లోని ఫారెస్ట్ సిబ్బందికి పులులను పట్టుకోవడానికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. పులిని బంధించేందుకు 4 బోన్లు ఏర్పాటు, మరో 5 బోన్ల ఏర్పటుకు కసరత్తు చేస్తున్నారు. డివిజన్‌లో 8 నుంచి 12 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులుల సంరక్షణతో పాటు ప్రజలకు హాని కలగకుండా ప్రణాళికలు రూపొదిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో పులులు దాడి చేసిన ఘటనలు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ అధికారులు సూచించారు.