ఆదిలాబాద్‌ ఏజెన్సీ పల్లెల్లో పులి భయం

ABN , First Publish Date - 2020-02-12T09:49:48+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి, భీంపూర్‌ మండలాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. గడిచిన

ఆదిలాబాద్‌ ఏజెన్సీ పల్లెల్లో పులి భయం

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి11 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా తాంసి, భీంపూర్‌ మండలాల ప్రజలను పులి భయం వెంటాడుతోంది. గడిచిన పక్షం రోజుల్లోనే నాలుగైదు పశువులను పులి హతమార్చడం ఆందోళన రేపుతోంది. దీంతో మా రుమూల గిరిజన పల్లెల్లో విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. మంగళవారం భీంపూర్‌ మండలంలోని గొల్లాఘాట్‌, పిప్పల్‌కోటి, తాంసి(కె) గ్రామాల్లో  అధికారులు అవగాహన కల్పించారు. రైతులు కూలీలు, పశువుల కాపరులు ఇతర పనులకు వెళ్లి న వారు చీకటి పడక ముందే ఇళ్లకు చేరుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - 2020-02-12T09:49:48+05:30 IST