చిరుతపులి చర్మాన్ని విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-12T10:27:19+05:30 IST

చిరుతపులి చర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురిని రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మరుపల్లికి

చిరుతపులి చర్మాన్ని విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

గోదావరిఖని/మంచిర్యాల, మార్చి 11: చిరుతపులి చర్మాన్ని విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురిని రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా మరుపల్లికి చెందిన కొండగొర్ల తిరుపతి, గంగారాం, తులసీరాం తమ గ్రామ అటవీ ప్రాంతంలో కొంతకాలంగా తిరుగుతున్న చిరుతపులిని విద్యుత్‌ వైర్లతో ఉచ్చు బిగించి చంపారు. దాని చర్మాన్ని మంచిర్యాల జిల్లా సిర్సాలో విక్రయించేందుకు ప్రయత్నించారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐలు రాజ్‌కుమార్‌, కిరణ్‌, ఎస్‌ఐ మస్తాన్‌ ఆధ్వర్యంలో పోలీసుల బృందం ఈ ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పులి చర్మం, గోర్లను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ఇప్పటికే పలు గ్రామాలకు చెందిన 350 మంది వేటగాళ్లను బైండోవర్‌ చేశామన్నారు.

Updated Date - 2020-03-12T10:27:19+05:30 IST