వెయ్యి తాటి, ఈత మొక్కలు నాటాలి: శ్రీనివాస్
ABN , First Publish Date - 2020-06-25T08:54:50+05:30 IST
వెయ్యి తాటి, ఈత మొక్కలు నాటాలి: శ్రీనివాస్

హైదరాబాద్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో 1000 తాటి, ఈత మొక్కలు నాటాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ అధికారులను ఆదేశించారు. మంత్రి బుధవారం అబ్కారీ శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. 4 వేల గ్రామాల్లో 40 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. మూడేళ్లలో 12,751 గ్రామ పంచాయతీల్లో తాటి, ఈత మొక్కలను నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.