ఆ మాటలు నావి కావు..

ABN , First Publish Date - 2020-02-12T09:16:46+05:30 IST

ఈనెల పదో తేదీన ఆంధ్రజ్యోతి రెండో పేజీలో ‘‘పోలీసుల రాజ్యం, ప్రజాస్వామ్యానికి విఘాతం’’ అన్న వార్తలో, శీర్షికతో సహా అనేక అంశాలు తనకు

ఆ మాటలు నావి కావు..

  • ప్రొఫెసర్‌ సుధారాణి వివరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల పదో తేదీన ఆంధ్రజ్యోతి రెండో పేజీలో ‘‘పోలీసుల రాజ్యం, ప్రజాస్వామ్యానికి విఘాతం’’ అన్న వార్తలో, శీర్షికతో సహా అనేక అంశాలు తనకు ఆపాదించారని, ఆ మాటలు తాను అనలేదని బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. తాను పేర్కొన్నట్లుగా వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. మహబూబ్‌నగర్‌లో ఈనెల 9న ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ఐదో మహాసభల సందర్భంగా ‘నేరము-శిక్ష, సామాజిక, సాంస్కృతిక కోణాలు’ అన్న అంశంపై తాను అతిథిగా ప్రసంగించానని ఆమె తెలిపారు. రాచరిక వ్యవస్థలో అమల్లో ఉన్న శిక్షావిధానాలు, మనుస్మృతిలోని అంశాలు, దళిత స్త్రీలపై జరిగే అత్యాచారాలు వంటి అంశాలనే తాను ప్రసంగంలో స్పృశించానని ఆమె పేర్కొన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్ఠం చేయాలని, ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని మాత్రమే తన ప్రసంగంలో చెప్పానని ఆమె వివరించారు. ‘‘పోలీసుల రాజ్యం’’ వంటి మాటలు కానీ, ప్రజాస్వామ్యం మంచిచెడ్డల ప్రస్తావన కానీ తన ప్రసంగంలో దొర్లలేదని, తాను చెప్పని అంశాలను తనకు ఆపాదించడం విచారకరమని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-12T09:16:46+05:30 IST