నగదు అవసరం ఉన్నవారే బ్యాంకులకు రావాలి

ABN , First Publish Date - 2020-04-18T08:55:54+05:30 IST

నగదు అత్యవసరం ఉన్నవారు మాత్రమే బ్యాంకుల వద్దకు రావాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు.

నగదు అవసరం ఉన్నవారే బ్యాంకులకు రావాలి

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌


మహబూబాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 17 : నగదు అత్యవసరం ఉన్నవారు మాత్రమే బ్యాంకుల వద్దకు రావాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ.500, రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 వారి ఖాతాల్లో జమచేసిందని, వాటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటే మంచిదని చెప్పారు. వచ్చిన నగదు వెనక్కి పోతుందనే ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో అదనంగా ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 79 వాయిలెన్స్‌ కేసులు, 20 షాపులు, 5,355 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో శ్రీరాం పాల్గొన్నారు. 


అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, కమిషనర్‌ బాబు పాల్గొన్నారు. 


భౌతిక దూరమే ఆయుధం

మండలంలోని గంట్లకుంట గ్రామంలో కలెక్టర్‌ గౌతమ్‌ పర్యటించి బ్యాంక్‌ సేవలను, హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న దంపతులను వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో అపర్ణ, ఇన్‌చార్జీ ఏవో కుమార్‌యాదవ్‌, వైద్యాధికారి దిలీప్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-04-18T08:55:54+05:30 IST