ఢిల్లీకి వెళ్లొచ్చినవారు ముందుకు రావాలి

ABN , First Publish Date - 2020-04-01T08:15:35+05:30 IST

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా వాసులు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి

ఢిల్లీకి వెళ్లొచ్చినవారు ముందుకు రావాలి

వైద్య పరీక్షలకు సహకరించాలి: ఎర్రబెల్లి

వరంగల్‌ అర్బన్‌, మార్చి 31, (ఆంధ్రజ్యోతి)/తొర్రూరు రూరల్‌: ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా వాసులు వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వర్గం మతపెద్దలతో మాట్లాడి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం హన్మకొండలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, గుర్తూర్‌ గ్రామాల్లో ఉన్న వలస కూలీలకు ప్రభుత్వం తరఫున 12 కిలోల బియ్యం, రూ.500 నగదును మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు.   

Updated Date - 2020-04-01T08:15:35+05:30 IST