తిమ్మాయిపల్లి సర్పంచ్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-27T11:27:05+05:30 IST
వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ(23) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితం జరిగి న ఎన్నికల్లో అపర్ణ సర్పంచ్‌గా
యాలాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ(23) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాది క్రితం జరిగి న ఎన్నికల్లో అపర్ణ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉం టున్నారు. అయితే, బుధవారం కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్నటికీ పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందారు. మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.