ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శం: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-04-14T09:51:14+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్ర(కె) గ్రామంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేస్తున్న ఉపాధి కూలీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శనీయం, వారి

ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శం: ఎర్రబెల్లి

  • కూలీల చైతన్యానికి హ్యాట్సాప్‌ అంటూ ట్వీట్‌

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్ర(కె) గ్రామంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేస్తున్న ఉపాధి కూలీలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు. ఈ ఉపాధి కూలీలు అందరికీ ఆదర్శనీయం, వారి చైతన్యానికి హ్యాట్సాప్‌ అంటూ సోమవారం ట్విటర్‌లో వారి ఫొటోలను షేర్‌ చేశారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నా చాలా మంది పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి వారంతా ఈ కూలీలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌ కూడా ఆదిలాబాద్‌ జిల్లా కూలీల చైతన్యాన్ని అభినందిస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు.

Updated Date - 2020-04-14T09:51:14+05:30 IST