బీఆర్‌కేఆర్ భవన్‌లో థర్మల్ స్కానర్
ABN , First Publish Date - 2020-04-05T07:36:42+05:30 IST
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శనివారం థర్మల్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు నుంచి లోపలికి...

- కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు స్ర్కీనింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శనివారం థర్మల్ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు నుంచి లోపలికి ప్రవేశించగానే.. ఉద్యోగుల లిఫ్టు సమీపంలో స్కానర్‌ను ఉంచారు. భవన్‌లోకి వెళ్లే ప్రతి ఉద్యోగినీ పరీక్షిస్తున్నారు. ఇన్‌ఫ్రారెడ్ థర్మోగ్రఫీ ద్వారా స్కాన్ చేయగానే వ్యక్తి శరీర ఉష్ణోగ్రత వివరాలు తెలిపే డిజిటల్ ఇమేజ్ వస్తుంది. దీంతో జ్వర తీవ్రతను గుర్తిస్తారు. దగ్గు, జలుబు లక్షణాలుంటే క్వారంటైన్ చేస్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి శాఖలో 20 శాతం సిబ్బందిని మాత్రమే భవన్‌లోకి అనుమతిస్తున్నారు.