అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2020-03-19T11:04:32+05:30 IST

ఈజీఎస్‌ ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి గూడూరు

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి గూడూరు రాంరెడ్డి


జఫర్‌గడ్‌, మార్చి 18 : ఈజీఎస్‌ ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి గూడూరు రాంరెడ్డి హెచ్చరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జఫర్‌గడ్‌ మండలంలో చేపట్టిన ఈజీఎస్‌ పనులపై సామాజిక తనిఖీ బృందాలు ఈ నెల 17 వరకు గ్రామసభలు నిర్వహించారు. సామాజిక తనిఖీల నివేదికలపై బుధవారం జఫర్‌గడ్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రడపాక సుదర్శన్‌ అధ్యక్షతన ఓపెన్‌ ఫోరం (ప్రజావేదిక) సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీవో రాంరెడ్డి హాజరై గ్రామాల వారీగా పనులు, నిర్వహణ, రికార్డులు, మస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కూలీలకు వరం లాంటిదన్నారు. వలసల నివారణకు, జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతోందన్నారు. కూలీల భాగస్వామ్యంతో ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు గ్రామాల్లో చేపట్టడం జరుగుతోందన్నారు.


జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కల్పిస్తూ పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కాగా, ఈజీఎస్‌ పనుల సామాజిక తనిఖీ నివేదికలపై గ్రామాల వారీగా సమీక్ష అర్ధరాత్రి వరకూ కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశం లో జడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్‌, జిల్లా విజిలెన్స్‌ అధికారి ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జీవీసీ ప్రణయ్‌, ప్లాంటేషన్‌ మేనేజర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎస్‌టీఎం సాయికిరణ్‌, ఎస్‌ఆర్‌పీ కిష్టయ్య, ఈజీఎస్‌ ఇన్‌చార్జి ఏపీవో జగదీశ్‌, టీఏలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-19T11:04:32+05:30 IST