వినియోగదారులు లేనిదే ప్రభుత్వాలు లేవు

ABN , First Publish Date - 2020-12-25T07:54:45+05:30 IST

వినియోగదారులు లేనిదే ప్రభుత్వాలు లేవని, వారు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వాలు పనులు చేపడతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి

వినియోగదారులు లేనిదే ప్రభుత్వాలు లేవు

వారు చెల్లించే పన్నులతోనే పనులు: వినోద్‌కుమార్‌ 


బర్కత్‌పుర, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులు లేనిదే ప్రభుత్వాలు లేవని, వారు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వాలు పనులు చేపడతాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. వినియోగదారుల హక్కులపై విస్తృతమైన అవగాహన పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలంగాణ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో అలుపెరగని సేవకులకు అభినందన, సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  రేలారే గంగ, నర్సింహా, కె.సంగీత, మహమ్మద్‌ కరీమా బేగం, సంపత్‌ తదితరులను అవార్డులతో సత్కరించారు. 

Updated Date - 2020-12-25T07:54:45+05:30 IST