వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ..
ABN , First Publish Date - 2020-10-21T12:28:47+05:30 IST
వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి నగదు, బంగారం, వెండి దోచుకున్న ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెచ్‌ఎంటీనగర్‌లో నివసించే ప్రదీ్‌పకుమార్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన అర్జున్, మాయ దంపతులు కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో పనిలో

హైదరాబాద్ : వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి నగదు, బంగారం, వెండి దోచుకున్న ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెచ్‌ఎంటీనగర్‌లో నివసించే ప్రదీ్‌పకుమార్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన అర్జున్, మాయ దంపతులు కొన్నిరోజుల క్రితం ఆయన ఇంట్లో పనిలో చేరారు. కొంతకాలం నమ్మకంగా పనిచేసిన వారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రదీ్‌పకుమార్ తల్లి లలిత(70)కు మత్తు మందు ఇచ్చి ఇంట్లో ఉన్న రూ. 10 లక్షలు, 18 తులాల బంగారం, 40 తులాల వెండి దోచుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.