యువతి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-10-03T10:05:08+05:30 IST
యువతి దారుణ హత్య

కోట్‌పల్లి, అక్టోబరు 2: గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల పరిధిలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కోట్‌పల్లి మండలం అన్నసాగర్ గ్రామం నుంచి కోట్‌పల్లి ప్రాజెక్ట్‌కు వెళ్లే దారిలో గుడి వద్ద ఓ సంచిలో యువతి మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. యువతి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.