ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామరక్షక దళాలు
ABN , First Publish Date - 2020-05-19T09:37:47+05:30 IST
వేసవి దొంగల్ని కట్టడి చేసేందుకు గ్రామాల్లో పోలీసులు ‘గ్రామరక్షక దళాలు’ ఏర్పాటు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ కమిషనరేట్

- పల్లెల్లో నేరాల నియంత్రణకు ఏర్పాటు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): వేసవి దొంగల్ని కట్టడి చేసేందుకు గ్రామాల్లో పోలీసులు ‘గ్రామరక్షక దళాలు’ ఏర్పాటు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామరక్షక దళాల్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. వేసవిలో అధికంగా జరిగే చోరీలను అరికట్టేందుకు గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేస్తున్నారు. 18-50 ఏళ్ల స్థానికులతో రక్షకదళాలు ఏర్పాటు చేస్తారు. వంతుల వారీగా ఒక్కో రోజు ఒక్కో గ్రూప్ రాత్రి వేళ తమ పరిధిలో గస్తీ కాస్తాయి. అయితే వీరికి ఎలాంటి పారితోషికం ఉండదు. తమ ప్రాంత రక్షణ కోసం పోలీ్‌సలకు స్వచ్ఛందంగా సహకారం అందిస్తారు. కానిస్టేబుల్, హోంగార్డు ఆఫీసర్ స్థాయిలో రక్షక దళానికి నాయకత్వం వహిస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.