పెద్దపులి కలకలం!
ABN , First Publish Date - 2020-12-15T07:44:00+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ రైతు తన పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై దాడికి పాల్పడింది. టేకులపల్లి మండలంలోని శంభూనిగూడెం పంచాయతీ పరిధిలో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న

పొలంలో కట్టేసిన ఆవుదూడపై దాడి
రైతు కుటుంబసభ్యుల కేకలతో పరార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
టేకులపల్లి, డిసెంబరు 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి కలకలం రేపింది. ఓ రైతు తన పొలం వద్ద కట్టేసిన ఆవు దూడపై దాడికి పాల్పడింది. టేకులపల్లి మండలంలోని శంభూనిగూడెం పంచాయతీ పరిధిలో అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న గుండ్లమడుగులో రైతు భూక్యా కానియా.. తనకున్న రెండున్నర ఎకరాల భూమిని సాగుచేసుకొని జీవిస్తున్నాడు. ఈ ఏడాది చేనులో పత్తి, వేరుశనగ, మిర్చి సాగుచేశాడు.
కుటుంబం మొత్తం అక్కడే నివసిస్తూ.. రాత్రి వేళ చేనుకు కాపలా కాస్తుంటారు. పశువులను కూడా అక్కడే కట్టేస్తారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఓ పెద్దపులి.. అక్కడ కట్టేసి ఉన్న పశువుల మందపై దాడి చేసింది. ఓ ఆవుదూడ మెడను గట్టిగా కొరకడంతో దానికి తీవ్ర గాయాలయ్యయి. ఇది చూసిన రైతు కుటుంబసభ్యులు కేకలు వేయడంతో పులి పారిపోయింది.