తెలంగాణ ఆడిట్ విధానం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2020-10-14T07:25:03+05:30 IST
తెలంగాణలో అమలు చేస్తున్న ఆన్‌లైన్ ఆడిట్ విధానం దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు.

ఆన్‌లైన్ ఆడిట్‌ను అధ్యయనం చేసిన కర్ణాటక అధికారులు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అమలు చేస్తున్న ఆన్‌లైన్ ఆడిట్ విధానం దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఆ రాష్ర్టానికి చెందిన ఆడిట్, పంచాయితీరాజ్ శాఖల ఉన్నతాధికారుల బృందం మంగళవారం తెలంగాణలో అనుసరిస్తున్న ఆడిట్ విధానాన్ని పరిశీలించింది. రాష్ట్ర ఆడిట్‌శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సంచాలకుడు మార్తినేని వెంకటేశ్వరరావుని కర్ణాటక ఉన్నతాధికారులు కలిశారు. ఆ తరువాత జరిగిన ఉమ్మడి సమావేశంలో తెలంగాణలో 2 నెలలుగా నిర్వహించిన ఆడిట్ ఆన్‌లైన్ విధానాన్ని పవర్‌పాయింట్ ద్వారా ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ రాము వివరించారు.