కరోనాపై సమరం సామాజిక బాధ్యత

ABN , First Publish Date - 2020-03-21T10:37:23+05:30 IST

కరోనాపై సమరం సామాజిక బాధ్యత

కరోనాపై సమరం సామాజిక బాధ్యత
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలను తీసుకుంటోందని, ప్రజలంతా ఎవరికి వారు సామాజిక బాధ్యతగా భావించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌లోని కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, మత పెద్దలు, ఫంక్షన్‌ హాళ్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ అన్ని యంత్రాంగాలను అప్రమత్తం చేశారని తెలిపారు.


రాష్ట్రంలో నివసించేవారెవరికీ ఈ వైరస్‌ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారిలోనే అది ఉన్నదని పేర్కొన్నారు. వారి నుంచి వైరస్‌ వేరేవారికి రాకుండా అత్యంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలంతా పరిస్థితిని అవగాహన చేసుకోవాలని, పెళ్లిళ్లు, దావత్‌లు, ఫంక్షన్లు ఆపేయాలని సూచించారు. ఇప్పటికే నిశ్చయమైన వాటిని పరిమితంగా నిర్వహించుకోవాలని కోరారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సీఎం కేసీఆర్‌ మళ్లీ ఆదేశాలిచ్చేంత వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు. ఈ సమావేశాలకు వచ్చే ముందుకు కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఉన్న వైద్య సిబ్బంది అందరి శరీర ఉష్ణోగ్రతను థర్మామీటర్‌తో పరీక్షించారు. 

Updated Date - 2020-03-21T10:37:23+05:30 IST