రాష్ట్రానికి 60 ఎంబీబీఎస్‌, 13 బీడీఎస్‌ సీట్లు

ABN , First Publish Date - 2020-12-10T08:37:10+05:30 IST

వైద్యవిద్య ప్రవేశాల్లో రాష్ట్రానికి 73 సీట్లు భర్తీ చేసే అవకాశం దక్కింది. ప్రతి మెడికల్‌ కాలేజీలో 15శాతం సీట్లను సెంట్రల్‌ పూల్‌ కింద భర్తీ చేస్తారు. దీనికి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు

రాష్ట్రానికి 60 ఎంబీబీఎస్‌, 13 బీడీఎస్‌ సీట్లు

జాతీయ కోటా మిగులుతో వెనక్కి 


హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య ప్రవేశాల్లో రాష్ట్రానికి 73 సీట్లు భర్తీ చేసే అవకాశం దక్కింది. ప్రతి మెడికల్‌ కాలేజీలో 15శాతం సీట్లను సెంట్రల్‌ పూల్‌ కింద భర్తీ చేస్తారు. దీనికి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోటాలో మిగిలిపోయిన సీట్లను ఆయా కళాశాలలకు వెనక్కి ఇచ్చేసి స్థానికులతో భర్తీకి అవకాశమిస్తారు. ఇలా ఈసారి రెండోవిడత కౌన్సెలింగ్‌లో ఎంపికైన విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు ఈనెల 8 చివరి గడువు కాగా, దేశవ్యాప్తంగా 2097 సీట్లు మిగిలాయి. వీటిలో తెలంగాణలోని 60 ఎంబీబీఎస్‌, 13 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో ఎంబీబీఎ్‌సలో 81, బీడీఎ్‌సలో 19 సీట్లు మిగిలాయి.  

Updated Date - 2020-12-10T08:37:10+05:30 IST