శ్రీనిధి రుణ బకాయిలు వారంలోగా చెల్లించాలి

ABN , First Publish Date - 2020-03-13T11:45:13+05:30 IST

జిల్లాలో స్వయం సహాయక సంఘాలు చెల్లించాల్సిన రూ.627 కోట్ల బకాయిలను వారంరోజుల్లోగా

శ్రీనిధి రుణ బకాయిలు వారంలోగా చెల్లించాలి

కలెక్టర్‌ నిఖిల


జనగామ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో స్వయం సహాయక సంఘాలు చెల్లించాల్సిన రూ.627 కోట్ల బకాయిలను వారంరోజుల్లోగా చెల్లించాలని కలెక్టర్‌ కె.నిఖిల ఆదేశించారు. కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో శ్రీనిధి బ్యాంక్‌ లింకేజీపై గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ శ్రీనిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక గ్రూ పులకు రుణాల లక్ష్యం రూ.73.62కోట్లుకాగా, ఇప్పటి వరకు రూ.26.68 కోట్లు రుణాలు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా 296 గ్రామసంఘాలు, 21.74 స్వయం సహాయక గ్రూపులు, 627 కోట్ల రూ పాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా 20.40 శాతంతో రాష్ట్రంలో బకాయిలలో 7వ స్థానంలో ఉం దన్నారు. వెంటనే శ్రీనిధి బకాయిలు ఈనెల 19లోగా చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు కేవలం 0.5శా తం ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని స్వ యం సహాయక సంఘాలు శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమీక్షలో డీఆర్‌డీవో జి.రాంరెడ్డి, ఏడీ ఆర్డీవో నూరోద్దీన్‌, డీజీఎం వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎం సరిత, డీపీఎంలు సమ్మక్క, వినిత, వరలక్ష్మీ, సుజాత, శ్రీనిధి మేనేజర్లు నర్సింహారా వు, భూకైలాస్‌,ఏపీఎంలు, సెర్ఫ్‌సిబ్బంది పాల్గొన్నారు.


ప్రజలకు వైద్యసేవలు అందించాలి

జనగామ టౌన్‌ : వందలాది గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందించే జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పకడ్బందీగా అందించాలని కలెక్టర్‌ కె.నిఖిల అన్నారు. జనగామ జిల్లా ఆస్పత్రిని గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీచేసి పలు విభాగాలను పరిశీలించారు. ఎమర్జెన్సీ, కరోనా ఐసోలేషన్‌, డయాలసిస్‌, ఔట్‌పేషెంట్‌ విభాగాలను పరిశీలించారు. కరోనా వైర్‌సపై ప్రజల్లో అవగాహన పెంచి వైద్యసేవలపై సన్నద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా డయాలసిస్‌ సెంటర్‌లో జరిగిన ప్రపంచ కిడ్నీ దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్‌ సెంటర్‌ ద్వారా కిడ్ని వ్యాధిగ్రస్తులకు అందించే సేవలు అభినందనీయం అన్నారు. కిడ్నీ వ్యాధుల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యసేవలు మెరుగుపర్చే విషయంపై వెంటనే ప్రతిపాదనలు అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.రఘు, ఆర్‌ఎంవో డాక్టర్‌ పి.సుగుణాకర్‌రాజు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T11:45:13+05:30 IST