ఆర్టిజన్లకు ప్రత్యేక సర్వీసు రూల్స్‌ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-27T08:32:38+05:30 IST
జెన్‌కోలో ఆర్టిజన్ ఉద్యోగుల ప్రత్యేక సర్వీసు నిబంధనలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంస్థలో రెండు రకాల

విద్యుత్తు కార్మిక సంఘాల డిమాండ్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జెన్‌కోలో ఆర్టిజన్ ఉద్యోగుల ప్రత్యేక సర్వీసు నిబంధనలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంస్థలో రెండు రకాల సర్వీసు నిబంధనలను అమలు చేస్తుండడంపై తెలంగాణ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్(1104) యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.పద్మారెడ్డి, జి.సాయిబాబా మండిపడ్డారు. ఆర్టిజన్ సర్వీసు నిబంధనలను జెన్‌కో యాజమాన్యం ఏకపక్షంగా విడుదల చేసిందంటూ అగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్జిజన్లకు విద్యుత్తు ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ ఉంటాయని గంతలో యాజమాన్యం చెప్పిందన్నారు. వీడీఏ స్థానంలో డీఏ, ప్రసూతి సెలవులు, కారుణ్య నియామకాలు.. ఇలా పలు సదుపాయాలు కల్పిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు, ఆర్టిజన్లకు మధ్య అన్ని విషయాల్లో వ్యత్యాసాలు పెంచుతూ ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అర్టిజన్ సర్వీస్ రూల్స్‌పై పునఃపరిశీలన చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.