మహిళల భద్రతకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-25T08:31:25+05:30 IST

నగరంలో ఈ ఏడాది 10 శాతం మేర నేరాలు తగ్గడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న పోలీసులు.. పోలీసింగ్‌లో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం

మహిళల భద్రతకే ప్రాధాన్యం

మూడు కమిషనరేట్ల సమన్వయంతో అంతరాష్ట్ర నేరగాళ్ల ఆటకట్టు

పోలీసింగ్‌లో 15 అంశాలతో 2021 కార్యాచరణ ప్రణాళిక


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): నగరంలో ఈ ఏడాది 10 శాతం మేర నేరాలు తగ్గడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న పోలీసులు.. పోలీసింగ్‌లో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రత, చిన్నారులపై అఘాయిత్యాలు అరికట్టడం, పోలీసు సిబ్బంది ఆరోగ్య సంరక్షణ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. ఇందుకోసం 2021లో చేపట్టనున్న 15 అంశాల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 

 • మహిళా భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. సేఫ్‌సిటీ ప్రాజెక్టు అమలు 
 • పాతబస్తీలో కొత్త భరోసా కేంద్రం ఏర్పాటు
 • 25 మంది కూర్చునేందుకు వీలుగా సిటిజన్‌ సపోర్ట్‌ హైల్ప్‌లైన్‌ కేంద్రం 
 • కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించడంపై ఫోకస్‌
 • వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బంది ప్రోత్సాహకంలో భాగంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు
 • నగరంలో 15 కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
 • 1,350 కమ్యూనిటీ రూఫ్‌టాప్‌ కెమెరా నెట్‌వర్క్‌ సర్వైలెన్స్‌ ఏర్పాటు
 • రోడ్లపై ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గించడానికి చర్యలు
 • సైబర్‌ నేరాలను తగ్గించడానికి అధిక సంఖ్యలో అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
 • పోలీస్‌ శాఖలో కంప్యూటర్‌ ఆధారిత జాబితా నిర్వహణ అమలు (ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టం)
 • నగర పోలీ్‌సశాఖ అధికారిక వెబ్‌సైట్‌లు ఇంటరాక్టివ్‌ చేయడం ద్వారా సునాయాసంగా యాక్సెస్‌ చేసే అవకాశం
 • నగరంలోని రోడ్లపై వేగ పరిమితులను ప్రదర్శించే ఏర్పాటు చేయడం
 • కమ్యునిటీ పోలీసింగ్‌ను మరింత ఆధునికీకరించడం
 • అంతరాష్ట్ర నేరస్తులను పట్టుకునేందుకు నగరంలోని మూడు 
 • కమిషనరేట్ల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడం
 • ఏడాదిలో రెండు సార్లు ట్రాఫిక్‌ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం

Updated Date - 2020-12-25T08:31:25+05:30 IST