రైతుల శ్రేయస్సు కోసమే రెవెన్యూ చట్టం

ABN , First Publish Date - 2020-10-07T06:30:27+05:30 IST

నూతన రెవెన్యూ చట్టం రైతుల పాలిట వరం లాంటిదని పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభివర్ణిం చారు. ఎంపీడీవో

రైతుల శ్రేయస్సు కోసమే రెవెన్యూ చట్టం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


కొడకండ్ల, అక్టోబరు 6: నూతన రెవెన్యూ చట్టం రైతుల పాలిట వరం లాంటిదని పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభివర్ణిం చారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వివిధ గ్రామాలకు చెందిన 167 మంది రైతులకు పట్టాదారుపాస్‌పుస్తకాలను వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నిజాం కాలం నాటి రికార్డులను సరిచేసే పనికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. అందరూ వ్యవసాయేతర ఆస్తులను ఆన్‌లైన్‌ చేసుకోవాలని కోరారు. పల్లెప్రగతి పథకం ద్వారా గ్రామాల్లో స్వఛ్ఛభారత్‌ నిర్వహించి వరుసగా మూడోసారి అవార్డు వచ్చిన సందర్భంగా మంత్రిని పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్‌ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. 


అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు స్థానిక గ్రాడ్యుయేట్ల ఓట్లను నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, జీసీసీ మాజీ చైర్మన్‌ గాంధీనాయక్‌, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కేలోత్‌ సత్తెమ్మ, తహసీల్దార్‌ యాకన్న, ఏఎంసీ చైర్మన్‌ పేరం రాము, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్‌ సింధె రామోజీ, మండల కోఆర్డినేటర్‌ ధీకొండ వెంకటేశ్వర్‌రావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


అర్చకుల వినతిపత్రం..

ధూపదీప నైవేద్య అర్చకులను ఆదుకోవాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిండిపోలు నాగ దక్షిణామూర్తి మంత్రి దయాకర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మండలకేంద్రంలో మంత్రిని కలిసి అర్చకుల సమస్యలపై మెమోరాండం అందజేశారు. కరోనా కాలంలో గుళ్లకు భక్తులు రాక, కార్యక్రమాలు లేక అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పన్నాల వెంకటేశ్వరశర్మ, కోడూరు సోమయ్య, శ్యామ్‌, మౌర్య శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-07T06:30:27+05:30 IST