భర్తను కడతేర్చిన భార్య

ABN , First Publish Date - 2020-03-23T10:47:06+05:30 IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌ కాశికుంటలో రాదారపు

భర్తను కడతేర్చిన భార్య

వివాహేతర సంబంధమే కారణం

శంభునిపేట, మార్చి 22 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని కరీమాబాద్‌ కాశికుంటలో రాదారపు రాజు(33) తన భార్యతో నివాసముంటున్నాడు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రాజు భార్య శివరాత్రి అనిల్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి వివాహిత అనిల్‌తో కలిసి భర్తను తాడుతో మెడకు ఉరివేసి చంపింది. ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. మృతదేహం ఇంట్లోనే పడి ఉండటంతో ఆదివారం కుళ్లిన వాసన వచ్చింది. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి చెల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-03-23T10:47:06+05:30 IST