పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారు: హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-09T01:13:29+05:30 IST

పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారు: హైకోర్టు

పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారు: హైకోర్టు

హైదరాబాద్: పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో విశ్రాంత వెటర్నరీ వైద్యుడు నారాయణరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. లాక్ డౌన్ లో పండ్ల విక్రయాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చో తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరో పది రోజుల్లో మామిడి, నిమ్మ అమ్మకాలు ముగుస్తాయని హైకోర్టు తెలిపింది. సీజనల్ పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారని హైకోర్టు పేర్కొంది. లాక్ డౌన్ లో పండ్ల విక్రయాలకు అనుమతిచ్చామని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక సంతలు ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. ఎలాంటి ఉత్తమ ఏర్పాట్లు చేయగలరో ఈ నెల 13లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 13కు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-05-09T01:13:29+05:30 IST