సిల్లీ రీజన్స్‌తో బయట తిరుగుతున్న జనం

ABN , First Publish Date - 2020-04-15T20:24:10+05:30 IST

నగరంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది.

సిల్లీ రీజన్స్‌తో బయట తిరుగుతున్న జనం

హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. తాము ఎంత అవగాహన కల్పిస్తున్నా.. జనాలు మాత్రం సిల్లీ రీజన్స్‌తో బయటకు వస్తున్నారని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు అపహాస్యం అవుతున్నాయి. ఎక్కడ చూసినా జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. అవసరం లేకున్నా రోడ్లమీదకు వస్తుండడంతో వాళ్లను నివారించడం పోలీసులకు కత్తిమీద సామే అవుతోంది. పాతబస్తీలో వాహనాలు తిరుగుతున్నాయి. అయితే పోలీసులు వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు. ఏ కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చినవారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-15T20:24:10+05:30 IST