ఓటుకు నోటు కేసు శుక్రవారానికి వాయిదా
ABN , First Publish Date - 2020-11-25T08:03:19+05:30 IST
ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్‌సింహ హైకోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో గడువు కావాలని కోరారు.
దీంతో ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం అదే రోజుకు వాయిదా వేసింది.