పాముల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ABN , First Publish Date - 2020-06-06T09:34:39+05:30 IST

హైదరాబాద్‌ శివారులోని బౌరంపేట రిజర్వ్‌ ఫారె్‌స్టలో పాముల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

పాముల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులోని బౌరంపేట రిజర్వ్‌ ఫారె్‌స్టలో పాముల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రూ.1.40 కోట్ల వ్యయంతో చెన్నైలోని గిండీ స్నేక్‌ పార్క్‌కు దీటుగా ఈ సంరక్షణ కేంద్రాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ సహకారంతో రాష్ట్రంలో పట్టుకున్న పాములను ఈ కేంద్రంలో సంరక్షిస్తారు. హైదరాబాద్‌ జూపార్క్‌ వెబ్‌సైట్ ‌(www.nehruzoopark.in) యాప్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అరణ్యభవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు.

Updated Date - 2020-06-06T09:34:39+05:30 IST