ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T06:50:36+05:30 IST
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రియల్టర్లు, ప్లాట్ల యజమానులు, డాక్యుమెంట్ రైటర్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వీరి ఆందోళనలకు కాంగ్రెస్

రియల్టర్లు, ప్లాట్ల యజమానుల డిమాండ్
పలు చోట్ల రహదారుల దిగ్బంధం, ధర్నాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రియల్టర్లు, ప్లాట్ల యజమానులు, డాక్యుమెంట్ రైటర్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వీరి ఆందోళనలకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. హయత్‌నగర్‌లో జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాకు భారీ ఎత్తున ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు తరలిరావడంతో గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది. వ్యాపారులు, నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎల్‌బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి, హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. రమణ, రాంరెడ్డిలు మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ ఎదుట స్థిరాస్తి వ్యాపారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పద్ధతి ప్రవేశపెట్టి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాట్ల యజమానులు హైవేను దిగ్బంధించారు.