మేకను చంపి తిన్న చిరుత

ABN , First Publish Date - 2020-12-19T07:25:45+05:30 IST

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి మేకల మందపై దాడి చేసిన

మేకను చంపి తిన్న చిరుత

భయాందోళనలో నస్రుల్లాబాద్‌ వాసులు

బాన్సువాడ, డిసెంబరు 18: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి మేకల మందపై దాడి చేసిన చిరుత ఒక మేకను ఎత్తుకెళ్లి తినేసింది. బాన్సువాడ-నిజామాబాద్‌ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో పులి సంచరించడంతో అటు ప్రయాణికులు, ఇటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళుతున్న కాపర్లు, రైతులు జంకుతున్నారు.


కొన్ని రోజుల క్రితం నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు, వాహనదారులు చెబుతున్నా.. అటవీ అధికారులు మాత్రం  బోనును ఏర్పాటు చేయకపోవడం, పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడంపై  ప్రజలు మండిపడుతున్నారు.


Read more