ఎక్కడ చూసినా వరదే

ABN , First Publish Date - 2020-10-19T08:28:12+05:30 IST

అయ్యప్పకాలనీ, మల్లిఖార్జున్‌నగర్‌, మల్లిఖార్జున్‌నగర్‌ ఫేజ్‌-2, త్యాగరాయనగర్‌, హనుమాన్‌నగర్‌లో 300లకు పైగా ఇళ్లు వరదనీటిలోనే ఉన్నాయి. మల్లిఖార్జున్‌నగర్‌ ఫేజ్‌-2లోని తన ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేక

ఎక్కడ చూసినా వరదే

హైదరాబాద్‌ సిటీ: అయ్యప్పకాలనీ, మల్లిఖార్జున్‌నగర్‌, మల్లిఖార్జున్‌నగర్‌ ఫేజ్‌-2, త్యాగరాయనగర్‌, హనుమాన్‌నగర్‌లో 300లకు పైగా ఇళ్లు వరదనీటిలోనే ఉన్నాయి. మల్లిఖార్జున్‌నగర్‌ ఫేజ్‌-2లోని తన ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి లేక  ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ మళ్లీ బంధువుల ఇంటికి పయనమైంది. మూసీ సమీపంలోని మూసానగర్‌, శంకర్‌నగర్‌, వాహేద్‌నగర్‌లోని దాదాపు 300 ఇళ్లలోకి వరద  నీరు చేరింది. గాంధీనగర్‌, స్నేహమయి కాలనీ, అఖిలాండేశ్వర్‌నగర్‌, పీవీఆర్‌ కాలనీ, సాహేబ్‌నగర్‌, సామనగర్‌, ఆంధ్రకేసరీ నగర్‌, శారదనగర్‌, భాగ్యలతలో కొంత భాగం, బాలాజీనగర్‌, జయకృష్ణ ఎన్‌క్లేవ్‌  కాలనీలోని వరదనీటిలో మునిగిపోయాయి. గడ్డిఅన్నారం  కోదండరాంనగర్‌, సీసలబస్తీ, పీఅండ్‌ టీ కాలనీ, వీవీ నగర్‌, కమలానగర్‌ కాలనీలోని వందలాది ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. ఎంఎల్‌ఆర్‌కాలనీ,  దీన్‌దయాళ్‌నగర్‌లలో సుమారు 3వందల ఇళ్లు వరదనీటిలో మునిగిపోగా, బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని సాయిబాలాజీ కాలనీ, నవయుగ కాలనీ, సీతా హోమ్స్‌,నారాయణపురం, గ్రీన్‌ హోంలలో సుమారు 5వందల ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి.  

Updated Date - 2020-10-19T08:28:12+05:30 IST