పట్టాలిచ్చిన స్థలంలోనే ఇళ్లు నిర్మించాలి

ABN , First Publish Date - 2020-09-05T07:35:01+05:30 IST

జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌లో గిరిజనులకు పట్టాలిచ్చిన స్థలంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని

పట్టాలిచ్చిన స్థలంలోనే ఇళ్లు నిర్మించాలి

జనగామ కల్చరల్‌, సెప్టెంబరు 4: జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్‌లో గిరిజనులకు పట్టాలిచ్చిన స్థలంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడ్‌ శోభన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గిరిజనుల ఇంటి స్థలాల ఆక్రమణకు వ్యతిరేకంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. ఈ దీక్షలను శోభన్‌ ప్రారంభించి మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి పట్టాలు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో భూక్య చందునాయక్‌, అజ్మీర సురేశ్‌, నేనావత్‌ శివ, దోలి, లక్ష్మి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-05T07:35:01+05:30 IST