ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-13T05:53:24+05:30 IST

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు సోమవారం

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యం

మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి


వరంగల్‌ సిటీ, అక్టోబరు 12 : ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు సోమవారం కడియం శ్రీహరితో పాటు జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ పి.సుధీర్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మహ్మద్‌ అజీజ్‌ఖాన్‌, 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ అబూబాకర్‌ ఇళ్లకు వెళ్లి వారి ఆస్తుల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజలు తమ ఆస్తుల వివరాలను అధికారులకు అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో మోసాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుటోందని తెలిపారు. 

Updated Date - 2020-10-13T05:53:24+05:30 IST