మంత్రి కారుకు అడ్డంగా పడుకున్న రైతు

ABN , First Publish Date - 2020-12-30T07:41:24+05:30 IST

తన భూ సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరుతూ ఆయన కారుకు అడ్డంగా పడుకున్నాడు.

మంత్రి కారుకు అడ్డంగా పడుకున్న రైతు

గోపాల్‌పేట, డిసెంబరు 29: తన భూ సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరుతూ ఆయన కారుకు అడ్డంగా పడుకున్నాడు. పరిష్కరిస్తే తప్ప పైకి లేచేది లేదని భీష్మించాడు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితుడు, ఆ గ్రామానికి చెందిన  గొల్ల కోటయ్య. ఆయన భార్య లక్ష్మి పేరట బొందల గడ్డ దగ్గర 772 సర్వే నంబరులో 34 గుంటల పట్టా భూమి ఉంది. ఆమె పేరుపై రైతుబంధు డబ్బులు కూడా వస్తున్నాయి. అయితే తమ పొలంలో వ్యవసాయం చేసుకుందామంటే కొంతమంది అడ్డుకుంటున్నారని, తన భార్య లక్ష్మి పేర ఉన్న పట్టాదారు పాసు పుస్తకం, ఆర్‌ఓఆర్‌, తహసీల్దార్‌కు చూపించినా పట్టించుకోవడం లేదని కోటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ముఖ్యమైన సమావేశం ఉందని కోటయ్యకు చెప్పిన మంత్రి, తహసీల్దార్‌ను పిలిచి రైతు సమస్యను చూడమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మేర కు సర్వేయర్‌ను పంపి సమస్య పరిష్కరిస్తామని  రైతును తహసీల్దార్‌ సముదాయించారు.

Updated Date - 2020-12-30T07:41:24+05:30 IST