పాల వ్యాపారంలోకి మంత్రి హరీశ్ రావు కుటుంబం
ABN , First Publish Date - 2020-08-22T09:31:28+05:30 IST
మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మిల్చి మిల్క్ పేరుతో పాల ఉత్పత్తులను ఆమె
- మిల్చి మిల్క్ పేరుతో కొత్త బ్రాండ్
- ఆవిష్కరించిన హరీశ్ సతీమణిశ్రీనిత
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మంత్రి హరీశ్‌రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మిల్చి మిల్క్ పేరుతో పాల ఉత్పత్తులను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ ేస్టషన్ల ద్వారా సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే తాజా, స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామన్నారు.