ప్రతిపక్షాలను కలిస్తే వాస్తవాలు తెలిసేవి

ABN , First Publish Date - 2020-04-28T09:59:20+05:30 IST

తెలంగాణలో కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ప్రతిపక్షాలను

ప్రతిపక్షాలను కలిస్తే వాస్తవాలు తెలిసేవి

  • కేంద్ర బృందం పర్యటనపై వీహెచ్‌

రాంనగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ప్రతిపక్షాలను సంప్రదించకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన బాగ్‌ అంబర్‌పేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బృందం వైద్యాధికారులతో కాకుండా, స్వయంగా పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అలా కాకుండా ప్రభుత్వం చెప్పింది వింటే ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని చెప్పారు.

Updated Date - 2020-04-28T09:59:20+05:30 IST