కేంద్రం నుంచి 10వేల కోట్లు ఇప్పించండి

ABN , First Publish Date - 2020-10-27T09:53:09+05:30 IST

వరద నష్టంపై మాట్లాడుతున్న బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని సంప్రదించి రాష్ట్రానికి రూ.10వేల కోట్ల సాయం

కేంద్రం నుంచి 10వేల కోట్లు ఇప్పించండి

బీజేపీ నేతలను డిమాండ్‌ చేసిన సీపీఐ


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వరద నష్టంపై మాట్లాడుతున్న బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని సంప్రదించి రాష్ట్రానికి రూ.10వేల కోట్ల సాయం  మంజూరు చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో  డిమాండ్‌ చేశారు. అకాల వర్షాల వల్ల న ష్టపోయిన వరి, పత్తి ఇతర పంటలకు నష్టపరిహారం అందించాలని కోరారు. రాజధానిలోని పలు కాలనీలు వరద  ముంపునకు గురయ్యాయని,  చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురికావడంతో   ఇళ్లలోకి నీరు చేరి నిరుపేదలు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం అందించకపోవడం అన్యాయమన్నారు.  మొక్కజొన్న పంటకు రూ.1800 మద్దతు ధరను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Updated Date - 2020-10-27T09:53:09+05:30 IST