కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో హల్ చల్

ABN , First Publish Date - 2020-07-10T18:27:02+05:30 IST

కరోనా వైరస్ సోకిన వ్యక్తి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హల్ చల్ చేశాడు.

కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో హల్ చల్

పెద్దపల్లి జిల్లా:  కరోనా వైరస్ సోకిన వ్యక్తి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హల్ చల్ చేశాడు. ఆస్పత్రిలో ఉండనని, ఇంటికి వెళతానని  సిబ్బందిని, పోలీసులను ఇబ్బంది పెట్టాడు. రామగుండంలో నిన్న ఓ వ్యక్తికి పాజిటీవ్ రావడంతో అతనిని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. అయితే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బయటకు వచ్చి హంగామా సృష్టించాడు. రాత్రివేళ డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది అతన్ని ఆపే ప్రయత్నం చేసినా వినకుండా బయటకు వచ్చాడు. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న ఇతర రోగులు ఆందోళన చెందారు. ఆ వ్యక్తి ఎంతకీ మాట వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఐసోలేషన్ వార్డులోకి వెళ్లిపోయాడు.

Updated Date - 2020-07-10T18:27:02+05:30 IST