చెవి ద్వారా కరోనా రాదు.. ఒకవేళ..

ABN , First Publish Date - 2020-07-28T21:32:26+05:30 IST

చెవి ద్వారా కరోనా రాదని.. ఒకవేళ పేషెంట్‌కు చెవిలో రంధ్ర ఉన్నా..

చెవి ద్వారా కరోనా రాదు.. ఒకవేళ..

హైదరాబాద్: చెవి ద్వారా కరోనా రాదని.. ఒకవేళ పేషెంట్‌కు చెవిలో రంధ్ర ఉన్నా.. ఇన్పెక్షన్ ఉన్నా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు బయటపడలేదని నిపుణులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రోజుకొక కొత్త యాంగిల్ చూపిస్తోంది. మొదట్లో ముక్కు, గొంతు, ఊపిరి తిత్తుల ద్వారా కరోనా సోకుతుందని.. ఈ మధ్య కాలంలో చెవి ద్వారా కూడా కరోనా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఈఎన్‌టి డాక్టర్ నరేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చెవి ద్వారా కరోనా రాదని, ఒకవేళ చెవిలో రంద్రాలు ఉండి, ముక్కు, నోట్లో వేలు పెట్టి.. చెవిలో వేలు పెడితే అలాంటప్పుడు వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. మాస్క్ ముక్కు, నోరు కవర్ చేస్తే సరిపోతుందని, చెవులు మూసుకోనవసరం లేదని డాక్టర్ తెలిపారు.

Updated Date - 2020-07-28T21:32:26+05:30 IST