జనగణనను పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2020-03-13T11:36:54+05:30 IST

జనగణన -2021 నిబంధనలపై అధికారులు అవగాహన పెంచుకొని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. ప్రగతి

జనగణనను పకడ్బందీగా చేపట్టాలి

భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌


భూపాలపల్లిరూరల్‌, మార్చి 12: జనగణన -2021 నిబంధనలపై అధికారులు అవగాహన పెంచుకొని పకడ్బందీగా చేపట్టాలని  కలెక్టర్‌, జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు.  ప్రగతి భవన్‌లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు జనగణన దోహదపడుతుందని అన్నారు. జనాభా లెక్కల ఆధారంగానే ఆయా పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తుందని తెలిపారు.


ప్రతి ఇంటినీ సర్వే చేసి కుటుంబాల వివరాలు సేకరించాలన్నారు. వయసు, లింగం, గ్రామం, మండలాల వారీగా జనాభా, సామాజిక , సాంస్కృతిక, ఆర్థిక తదితర అంశాలను కచ్చిత సమాచారాన్ని పేపరుతో పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా సేకరించాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా సెన్సెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ దయాసాగర్‌, మాస్టర్‌ ట్రైనీ శివరామకృష్ణ జనాభా లెక్కల సేకరణపై ప్రొజెక్టర్‌ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసీ ఈవో శిరీష, ఆర్డీవో వై.వి.గణేష్‌, సీపీవో బిక్షపతి, జిల్లా సెన్సెస్‌ అధికారి శైలజ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:36:54+05:30 IST