వెన‘కేసు’కొస్తున్నారు

ABN , First Publish Date - 2020-11-25T07:32:23+05:30 IST

కరోనా కేసుల వాస్తవ సంఖ్య విషయంలో చాలామందిలో ఉన్న అనుమానాలు నిజమేనని తెలిపే ఓ

వెన‘కేసు’కొస్తున్నారు

 కరోనా పాజిటివ్‌లను దాస్తున్న రాష్ట్రాలు

 123 శాతంతో రెండోస్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ, నవంబరు 24: కరోనా కేసుల వాస్తవ సంఖ్య విషయంలో చాలామందిలో ఉన్న అనుమానాలు నిజమేనని తెలిపే ఓ పరిశీలన ఇది. దేశంలోని చాలా రాష్ట్రాలు పాజిటివ్‌లను దాచిపెడుతున్నాయని, పరీక్షలు సరిగా చేయ డం లేదని బలపరిచే అధ్యయనం ఇది. ఓ జాతీయ మీడి యా సంస్థ చేసిన పరిశీలనలో.. 20 పెద్ద రాష్ట్రాల జాబితాలో బిహార్‌ (132ు-3 లక్షలు), తెలంగాణ (123ు-3.2 లక్షలు), గుజరాత్‌ (109ు-2.1 లక్షలు) రాష్ట్రాలు వంద శాతంపైగా కేసులను రిపోర్టు చేయలేదు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లోనూ బిహార్‌ (15ు), తెలంగాణ (17ు) పనితీరు అధ్వానంగా ఉంది. వీటి తర్వాత 22ు పరీక్షలతో గుజరాత్‌ మూడో స్థానంలో నిలిచింది. తమిళనాడు, రాజస్థాన్‌ల్లో పాజిటివ్‌లలో ఒక్కటీ మిస్సవలేదు. ఈ రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లోనూ వంద శాతం సాధించాయి.


ప్రతి పది వేల మందికి వాస్తవ పరీక్షల సంఖ్యలోనూ బిహార్‌ (148), తెలంగాణ (185) అట్టడుగన ఉండటం గమనార్హం. పాజిటివ్‌ రేటు తప్పుడు అంచనాలో బిహార్‌ (232), తెలంగాణ (223), గుజరాత్‌ (209) డబుల్‌ సెంచరీ మార్క్‌ దాటాయి.  


Read more