జర్నలిస్టును దూషించిన ఎమ్మెల్యేపై కేసు

ABN , First Publish Date - 2020-12-10T10:20:17+05:30 IST

జర్నలిస్టును ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ దినపత్రికకు చెందిన జర్నలిస్టు సంతో్‌షనాయక్‌ను

జర్నలిస్టును దూషించిన ఎమ్మెల్యేపై కేసు

ప్రతిపక్ష నాయకులతో విలేకరి చేతులు కలిపాడు : ఎమ్మెల్యే


హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జర్నలిస్టును ఫోన్‌లో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఓ దినపత్రికకు చెందిన జర్నలిస్టు సంతో్‌షనాయక్‌ను ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈమేరకు అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఐపీసీ 109, 448, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ జర్నలిస్టు సంతో్‌షను బెదిరించిన పటాన్‌చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌ అలీ డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన మాటలు ఎవరినైనా బాధిస్తే చింతిస్తున్నానన్నారు. తన ప్రతిష్ఠను మంట గలిపేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులతో సదరు విలేకరి చేతులు కలిపారని ఆరోపించారు. 

Updated Date - 2020-12-10T10:20:17+05:30 IST