చార్జీలు, పన్నుల పెంపుతో పేదలపై భారం

ABN , First Publish Date - 2020-03-15T09:49:53+05:30 IST

అక్రమంగా సంపాదించిన డబ్బు పంచి, అమలు చేయలేని హామీలు గుప్పించి ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్‌..

చార్జీలు, పన్నుల పెంపుతో పేదలపై భారం

సమస్యలపై రాష్ట్రమంతా పర్యటిస్తా: ఎంపీ కోమటిరెడ్డి

తిప్పర్తి, మార్చి 14: అక్రమంగా సంపాదించిన డబ్బు పంచి, అమలు చేయలేని హామీలు గుప్పించి ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్‌.. ఇప్పుడు విద్యుత్తు చార్జీలు, పన్నులు పెంచి ప్రజలపై పన్నుల భారం మోపాలని చూస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కరెంటు చార్జీలు పెంచడంతోనే చంద్రబాబు ప్రభుత్వం పడిపోయిందని, రానున్న రోజుల్లో టీఆర్‌ఎ్‌సకు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. రూ.లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. నాలుగు సార్లు రూ.25వేల చొప్పున చేస్తామనడం విచారకరమన్నారు. ఆరేళ్లలో ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటినీ పూర్తి చేయలేదని విమర్శించారు. నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్‌.. గెలిచాక ఇటు వైపు కూడా రాలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-15T09:49:53+05:30 IST