బాకీల భారం.. రైతన్న బలవన్మరణం
ABN , First Publish Date - 2020-12-15T08:12:06+05:30 IST
పంట పెట్టుబడి కోసం చేసిన బాకీల భారం రైతన్న ప్రాణాలను బలిగొంది. నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తికి చెందిన దాసరి కృష్ణయ్య
నాగర్‌కర్నూల్ క్రైం, డిసెంబరు 14: పంట పెట్టుబడి కోసం చేసిన బాకీల భారం రైతన్న ప్రాణాలను బలిగొంది. నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తికి చెందిన దాసరి కృష్ణయ్య(45) అప్పులు చేసి పొలంలో బోరు వేస్తే, నీరు పడకపోవడంతో మనోవేదన చెందాడు.
ఏడెకరాల్లో వేసిన వరి, పత్తి పంటలు చేతికి రాలేదు. పెట్టుబడుల కోసం చేసిన రూ.6 లక్షల అప్పులు తీర్చలేక ఆదివారం క్రిమి సంహారక మందు తాగి బలవన్మరణం చెందాడు.