టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే

ABN , First Publish Date - 2020-12-05T09:09:51+05:30 IST

సాధారణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్పష్టమైందని కాంగ్రెస్‌ నేత,

టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే

 జీహెచ్‌ఎంసీలో ప్రజాభిప్రాయం ఇదే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): సాధారణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్పష్టమైందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎ్‌సను ఓడించే సత్తా కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఉందని గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు అభిప్రాయపడినట్లు ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల అభిప్రాయాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ స్పష్టం చేసిందంటూ విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం ట్వీట్‌ చేశారు. గ్రామీణ ఓటర్లతో పోలిస్తే పట్టణ ఓటింగ్‌ విధానం భిన్నంగా ఉంటుందని ఓ నెటిజన్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


దుబ్బాక ఓటమిని అసాధారణమైనదిగా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందన్నారు. మరోసారి పార్టీ మారేందుకు సమయం ఆసన్నమైందన్న ఓ నెటిజన్‌ వ్యాఖ్యకు విశ్వేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. తాను అధికారంలో ఉన్న పార్టీని వీడి వచ్చానన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. డబ్బు, అధికారం ద్వారా కాంగ్రెస్‌ నేతలను చేర్చుకున్నందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటోందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలు పనిచేయవన్నారు. కాగా,  విశ్వేశ్వరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వాస్తవానికి ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్నా.. అబద్ధమని ఖండిస్తున్నారు.


Updated Date - 2020-12-05T09:09:51+05:30 IST