ఆర్థికంగా ఆదుకోవాలని దంత వైద్యుల విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-05-17T09:30:01+05:30 IST

తమను ఆర్థికంగా ఆదుకోవాలని దంత వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దిల్‌షుక్‌ నగర్‌, సికింద్రాబాద్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దంత వైద్యులు శనివారం వైద్య

ఆర్థికంగా ఆదుకోవాలని దంత వైద్యుల విజ్ఞప్తి

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): తమను ఆర్థికంగా ఆదుకోవాలని దంత వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దిల్‌షుక్‌ నగర్‌, సికింద్రాబాద్‌ డెంటల్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంలో దంత వైద్యులు శనివారం వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌ని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ నోటి ద్వారా వ్యాప్తి చెందుతున్నందున  తమకు రిస్కు ఉన్నప్పటికి వైద్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలతో క్లినిక్‌లను తెరవడానికి అధిక వ్యయం అవుతుందని చెప్పారు. సిబ్బందికి జీతభత్యాలు చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కొంత కాలంపాటు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని  కోరారు. 

Updated Date - 2020-05-17T09:30:01+05:30 IST