ముందే చెప్పినా విడుదల అడ్డుకున్నారు

ABN , First Publish Date - 2020-09-29T07:54:28+05:30 IST

సత్యం కంప్యూటర్స్‌ ఒకప్పటి అధినేత రామలింగరాజుపై తీసిన ‘బ్యాడ్‌ బోయ్‌ బిలియనీర్స్‌ డాక్యుమెంటరీ’ గురించిన సమాచారాన్ని ఆయన ప్రతినిధికి తాము సమాచారం ఇచ్చామని, అయినా విడుదలను అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హైకోర్టుకు తెలియజేసింది

ముందే చెప్పినా విడుదల అడ్డుకున్నారు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): సత్యం కంప్యూటర్స్‌ ఒకప్పటి అధినేత రామలింగరాజుపై తీసిన ‘బ్యాడ్‌ బోయ్‌ బిలియనీర్స్‌ డాక్యుమెంటరీ’ గురించిన సమాచారాన్ని ఆయన ప్రతినిధికి తాము సమాచారం ఇచ్చామని, అయినా విడుదలను అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ హైకోర్టుకు తెలియజేసింది. ఈ డాక్యుమెంటరీలో మంచి, చెడు రెండూ ఉంటాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపామనీ,  కానీ విడుదలకు ఒక రోజుముందు ట్రయల్‌ కోర్టునుంచి ఇంజంక్షన్‌ ఉత్తర్వులు పొంది అడ్డుకున్నారని నెట్‌ఫ్లిక్స్‌ తరపు సీనియర్‌ న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు నివేదించారు. ప్రజా బాహుళ్యం (పబ్లిక్‌ డొమైన్‌)లో ఉన్న సమాచారం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీకి సంబంధీకుల నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అయినప్పటికీ తన క్లయింట్‌... రామలింగరాజు నుంచి అనుమతి పొందారన్నారు. ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్‌ 1కి వాయిదా వేసింది. 

Updated Date - 2020-09-29T07:54:28+05:30 IST