కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సంతోషి

ABN , First Publish Date - 2020-06-22T23:19:17+05:30 IST

కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సంతోషి

కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సంతోషి

సూర్యాపేట: సీఎం కేసీఆర్‌కు కల్నల్ సంతోష్ కుమార్ సతీమణి సంతోషి ధన్యావాదాలు తెలిపారు. తనకు మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. తన పిల్లలతో కూడా సీఎం కొద్దిసేపు గడిపారని సంతోషి తెలిపారు. కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థలపత్రాలు కేసీఆర్‌ అందజేశారు. రూ.4కోట్ల రూపాయల చెక్‌ను సంతోష్ బాబు భార్యకు.. రూ.కోటి చెక్‌ను సంతోష్ బాబు తల్లిదండ్రులకు అందజేశారు. కల్నల్‌ కుటుంబానికి జూబ్లిహిల్స్‌లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. సంతోష్‌ భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. 

Updated Date - 2020-06-22T23:19:17+05:30 IST