సీఎస్‌ను కలిసిన టీజీవో వాణిజ్యపన్నులశాఖ నేతలు

ABN , First Publish Date - 2020-09-16T21:32:09+05:30 IST

తెలంగాణ వాణిజ్యపన్నుల గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ను కలిశారు. వాణిజ్యపన్నులశాఖలో 18 కొత్త సర్కిళ్లు, 161 కొత్త పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు వారు కృతజ్ఞలు తెలిపారు.

సీఎస్‌ను కలిసిన టీజీవో వాణిజ్యపన్నులశాఖ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ వాణిజ్యపన్నుల గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ను కలిశారు. వాణిజ్యపన్నులశాఖలో 18 కొత్త సర్కిళ్లు, 161 కొత్త పోస్టులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు వారు కృతజ్ఞలు తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టులు 3 జాయిట్‌కమిషనర్లు, 6 డిప్యూటీ కమిషనర్‌లు, 10 అసిస్టెంట్‌ కమిషర్‌లు, 18 కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి పధకాలకు కావాల్సిన నిధులలో సింహభాగం సమకూర్చవలసిన బాధ్యత కలిగిన వాణిజ్యపన్నుల శాఖకుదిశానిర్ధేశం చేస్తూ ప్రస్తుత తరుణంలో ఆవశ్యకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం సీఎస్‌ వల్లనే సాధ్యమైందని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞలు తెలిపారు.


కొత్త ఉత్తర్వుల వల్ల డిపార్ట్‌మెంట్‌లో ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉన్నారని రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యోగి రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రభుత్వఖజానాకు అదనపు ఆదాయాన్నిసమకూర్చుతామని ప్రతినిధులు తెలిపారు. సీఎస్‌ను కలిసిన వారిలో సంఘం ప్రెసిడెంట్‌ వెంకటయ్య, జనరల్‌ సెక్రటరీ దేవేందర్‌, కోశాధికారి గిరిధర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌, అడ్వయిజర్‌ కానూరి రవి, హనుమాండ్లు, రమేష్‌, నరేందర్‌, నరేష్‌, మురళీధర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-09-16T21:32:09+05:30 IST