ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి-టీజీవో అసోసియేషన్‌

ABN , First Publish Date - 2020-07-18T23:31:41+05:30 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడ్డం నేర్చుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం హెచ్చరించింది.

ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి-టీజీవో అసోసియేషన్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, మర్యాదగా మాట్లాడ్డం నేర్చుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం హెచ్చరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన ఆరోపణలపై అసోసియేషన్‌ నేతలు సమావేశమైచర్చించారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలుగా, ఎంప్లాయిస్‌ జేఏసీ సెక్రటరీ జనరల్‌గా మమత స్వీట్‌ తినిపిస్తే తప్పేముందని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం తగదని,పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఈసందర్భంగా ఆయన అన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం సీఎంను కలవడం ఎప్పుడూ జరిగేదేనని ఉద్యోగుల సమస్యల పట్ల మేం ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే ఉంటామని దానికి జగ్గారెడ్డికి ఉన్నసమస్య ఏందో అర్ధం కావడం లేదన్నారు.


కావాలని ఉద్యోగ సంఘాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ  సమావేశంలో కోశాధికారి రవీందర్‌కుమార్‌, సహాధ్యక్షులు సహదేవ్‌, నగర శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణాయాదవ్‌,  కేంద్ర సంఘ బాధ్యులు మధుసూదన్‌గౌడ్‌, మీర్జాఅలీబేగ్‌, రవీందర్‌రావు, అరుణ్‌కుమార్‌, వెంకటయ్య, సుజాత, సబిత, శిరీష, స్వర్ణలత, డా.దీపారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T23:31:41+05:30 IST